రాజమండ్రి ప్రజాప్రతినిధులకు అక్కినేని వనజ మనవి
ఇళ్ల స్థలాల కోసం 2 న జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నాలను విజయవంతం చేయండి
పాత్రికేయుల సమావేశంలో అక్కినేని వనజ పిలుపు
గోడపత్రిక ను ఆవిష్కరించిన సిపిఐ నేతలు
Trinethram News : రాజమండ్రి ,మే 25 : గోదావరి నదికి ఆనుకుని ఉన్న తొర్రేడు కొంతమూరు కోలమూరు గాడాల బూరుగు పూడి, ఆవకు చెందిన సుమారు 2500 ఎకరాల భూమి రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని గిట్టు బాటు ధర లేక పంట నష్టం వచ్చి భూమిని అమ్మేసుకుంటున్నారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ తెలిపారు
ఆదివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలోపాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్ నేడు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు రాజమహేంద్రవరంలో గోదావరి అనుకుని ఉన్న మూడు పంటలు పండే 2500 ల వ్యవసాయ భూమి నేడు ఒక పంటకే పరిమితమైందని ఆమె అన్నారు జూన్ జూలైలో వచ్చే గోదావరి వరద వల్ల ఈ 2500 ఎకరాలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ముంపు సమస్యను వరద నీటిని పంపింగ్ ద్వారా రాజమండ్రి గోదావరిలోకి మళ్ళించాలని ఆమె అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ రాజమండ్రి ఎంపి రాజమండ్రి ఎమ్మెల్యేలు స్పందించి రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న ఎన్నికల హామీలను నెరవేర్చకపోవడం ఆలస్యం ఎందుకని ఆమె అన్నారు పేద మధ్యతరగతి ప్రజలు ఆశించే ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో జాప్యం ఎందుకని ఆమె ప్రశ్నించారు రాజమండ్రి అర్బన్ రూరల్ లో సీపీఐ 15 వేల పైగా దరఖాస్తులు రాశామని అవి ఎంక్వయిరీ చేసి ఇల్లు ఎందుకు ఇవ్వరని ఆమె అన్నారు రెండు మూడు నెలల్లో మీరు ఇల్లు ఇవ్వకపోతే మేమే ప్రభుత్వ స్థలాల్లో పాకలువేస్తామని ఆమె అన్నారు ఈ ఇళ్ల స్థలాల సమస్యలపై జూన్ రెండున మండల కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు
ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు జిల్లా సహాయ కార్యదర్శి కుండ్రపు రాంబాబు నగర సహాయ కార్యదర్శి సప్ప రమణ జిల్లా కార్యవర్గ సభ్యులు పి.లవణ్య పి.త్రిమూర్తులు సిపిఐ నగర నాయకులు టీ.నాగేశ్వరరావు రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


