Theaters : థియేటర్ల బంద్ ఉండదు

TRINETHRAM NEWS

క్లారిటీ ఇచ్చిన ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్‌

Trinethram News : తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మీడియా సమావేశం ముగిసింది. ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ మాట్లాడుతూ థియేటర్స్ బంద్ పై క్లారిటీ ఇచ్చారు.

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల సంయుక్త సమావేశం జరిగింది. జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదు అని క్లారిటీ ఇచ్చారు. అలాగే మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నాం.. నిర్ణీత సమయంలోగా మా సమస్యలను పరిష్కరించుకుంటాం అని తెలిపారు.

30న ఈసీ సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తాం .. థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరు నమ్మోద్దు అని స్పష్టం చేశారు. అలాగే థియేటర్ల బంద్ ప్రచారం పరిశ్రమలో అనేక అవాంతరాలను సృష్టించింది . సినీ పరిశ్రమలోని సమస్యలను ఎవరు పరిష్కరించలేరు, మాకు మేమే పరిష్కరించుకోవాలి అని ఆయన చెప్పుకొచ్చారు.

థియేటర్ల బంద్ హెచ్చరికలతో.. ఫిల్మ్‌ఛాంబర్‌లో కీలక సమావేశం జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో నిర్మాతలు సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. థియేటర్లలో పర్సంటేజి విధానాన్ని అమలు చేయాలని పట్టుబట్టారు. ఎగ్జిబిటర్లు. పర్సంటేజి విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ఎగ్జిబిటర్లు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

will be no theaters

You cannot copy content of this page

Scroll to Top