J. Shyamala Rao : తిరుమలలో టీటీడీ ఈఓ ఆకస్మిక తనిఖీలు

TRINETHRAM NEWS

Trinethram News : తిరుమల, 23 మే 2025: టిటిడి ఈఓ జె. శ్యామలారావు తిరుమలలోని సహజ శిలా తోరణం మరియు చక్ర తీర్థాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. తన తనిఖీలో భాగంగా ఈ ప్రాంతాలలో పార్కింగ్, శుభ్రత, మొదలైన అంశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం ఆయన చక్ర తీర్థం రాతి కొండలో చెక్కి ఉన్న సుదర్శన చక్రత్తాళ్వార్, నరసింహ స్వామి, ఆంజనేయ స్వామి ప్రతిమలను మరియు అక్కడే ఉన్న శివుని సాన్నిధ్యాన్ని కూడా పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆ ప్రాంగణంలో పరిశుభ్రత మెరుగుపరచాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శాఖ డిప్యూటీ ఈఓ సోమన్ నారాయణ, ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూధన్, టిటిడి అటవీ శాఖ సిబ్బంది మరియు ఇతరులు కూడా హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TTD EO conducts surprise

You cannot copy content of this page

Scroll to Top