పెద్దపల్లి, మే-21// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరిగింది తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రిక చి.ల.సౌ. యన్.మానస, రేణుక యాకయ్య ఏకైక పుత్రుడు యమ్. రాజేష్ కళ్యాణం బుధవారం రోజున ఉదయం 11 గంటల 5 నిమిషాల సుముహూర్తం నాడు ఘనంగా జరిగింది
ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, డిసిపి కరుణాకర్, అదనపు కలెక్టర్ డి.వేణు టి ఎన్ జి ఓ అధ్యక్షులు బొంకురి శంకర్ జిల్లా ఉన్నతాధికారులు అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు నేడు పెళ్లి చేసుకుంటున్నా నూతన వధూవరుల కోసం జిల్లాలోని టీఎన్జీవో సంఘం సేకరించిన 61 వేల 800 రూపాయల చెక్కును కలెక్టర్ అందించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


