పెద్దపల్లి జిల్లా మే-21//త్రినేత్రం ప్రతినిధి. పెద్దపల్లి పట్టణంలోని జండా చౌరస్తా వద్ద గల కూరగాయల మార్కెట్ ను అన్ని సౌకర్యాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు బుధవారం రోజు జెండా చౌరస్తా వద్ద గల కూరగాయల మార్కెట్ ను మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ మరియు మున్సిపల్ అధికారులు అలాగే హోల్ సెల్ మరియు రిటైల్ దుకాణ యజమానులతో సమావేశమై పనులకు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించడం జరిగింది అనంతరం మార్కెట్ మొత్తం ఎమ్మెల్యే విజయరమణ రావు నాయకులతో కలిసి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నూతన కూరగాయల మార్కెట్ నిర్మించడం జరుగుతుంది అని కూరగాయల మార్కెట్ లోని హొల్ సెల్, రిటైల్, మటన్, చికెన్ మరియు చేపల వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నూతన అన్ని సౌకర్యాలతో నూతన మార్కెట్ నిర్మిస్తామని అందుకు సంబంధించిన టెండర్ కూడా 15 నుండి 20 రోజులోపల పిలవడం జరుగుతుందని అన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ సతీష్,టౌన్ ప్లానింగ్ అధికారులు వినయ్, కిరణ్, మున్సిపల్ సిబ్బంది మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


