Reduce Green Tax : ఏపీలో లారీ యజమానులకు గుడ్ న్యూస్

TRINETHRAM NEWS

హరిత పన్ను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం

Trinethram News : అమరావతి : ఏపీలో ఎన్నికలకు ముందు లారీ యజమానుల సంఘాలతో జరిగిన పలు భేటీల్లో కూటమి హరిత పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. తాజాగా ఈ పన్నును తగ్గిస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గతంలో వాహనదారులు గరిష్టంగా ఏటా రూ.20 వేల వరకు హరిత పన్నును చెల్లించేవారు. కేబినెట్ నిర్ణయంతో ఇకపై 7-12 ఏళ్ల వాహనాలకు ఏడాదికి రూ.1,500, అలాగే 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ.3 వేల హరిత పన్నును ప్రభుత్వం వసూలు చేయనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for lorry

You cannot copy content of this page

Scroll to Top