మే 24 న పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభను విజయవంతం చేయాలి
క్రైస్తవులకు వ్యతిరేకం గా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం
ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ఐజి, జిల్లా ఎస్పీలు
మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్
Trinethram News : రాజమహేంద్రవరం మే 20 : పాస్టర్ ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు అనుమతి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ హెచ్చరించారు. మంగళవారం రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. క్రైస్తవులు ఎన్నికలలో ఓట్లు వేయలేదా ? క్రైస్తవులకు సమాన హక్కులు లేవా ? అని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల హత్య జరిగిన అనంతరం క్రైస్తవులు ప్రభుత్వానికి దూరం కాకూడదనే ఉద్దేశంతో పాస్టర్లకు రావలసిన 7 నెలల గౌరవ వేతనం ఇచ్చారని అన్నారు.
రాష్ట్రఐ జి, జిల్లా ఎస్పీలు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు . వారికి గతంలో ఆర్ఎస్ఎస్ తో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తనకు 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని అయితే పోలీసులు మీటింగ్ పెట్టుకోమని అంటూనే హౌస్ అరెస్టులు, నిర్బంధనలు చేస్తుంటారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉభయ గోదావరి జిల్లాలలో ప్రతి చర్చి లో మీటింగులు పెట్టి ఈనెల 24వ తేదీన జరిగే ప్రవీణ్ పగడాల సంస్మరణ సభకు వెళ్లవద్దని , వెళ్లిన వారిపై అరెస్టులు చేసి, కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనపై మాట్లాడిన, పోస్టర్లు ముద్రించిన, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కేసులు పెడతామని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ప్రవీణ్ పగడాల సంస్మరణ సభ కు సంబంధించిన పోస్టర్ వేసామని అన్నారు. ఆ పోస్టర్లు కొంతమంది పెద్దల పేర్లు వేసామని తెలిపారు. పోస్టర్ లో వేసిన పెద్ద ల పేర్లు కు సంబంధించిన వ్యక్తులను ఎమ్మార్వో ఆఫీస్ కు పిలిపించి వారిని రూ 50 వేల రూపాయల సొంత పూచీకత్తు కట్టించుకుని, బైండోవర్ కేసులు పెట్టారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయని, అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా ?
అని ప్రశ్నించారు. మాట్లాడే హక్కు గానీ, మీటింగులు పెట్టుకునే హక్కు గాని క్రైస్తవులకు లేవా ? అని ప్రశ్నించారు. మీటింగులు పెట్టుకునే హక్కు లేదని ప్రకటిస్తే మేము మీటింగులు పెట్టమని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి హత్యగానే నమ్ముతున్నామని అన్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన ముఖంపై శరీరంపై పలు చోట్ల ఉన్న గాయాలు వలన కచ్చితంగా హత్య చేసినట్లు కనిపిస్తున్నాయని వివరించారు. హత్య ఈరోజు జరిగితే, మరుసటి రోజు ప్రవీణ్ పగడాల ఇంట్లో ఉన్న ల్యాప్ టాప్, ఐ పోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఎకౌంట్లు సీజ్ చేశారని అన్నారు. ఈ మూడు చర్యలు ఎందుకు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఐజి మాట్లాడుతూ టీవీలో వస్తున్న క్లిప్పింగులకు, మాకు సంబంధం లేదని అన్నారని యాక్సిడెంట్ క్రింద మృతి చెందినట్లు కేసులు ముగించారని వివరించారు. ఈ సంఘటనకు సంబంధించి ఎవరైనా మాట్లాడితే కేసులు పెడతామని, తీవ్ర శిక్షలు పడేలాగా చేస్తామని హెచ్చరించారని అన్నారు. తాను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ క్రింద ఎఫ్ ఐ ఆర్, సీన్ ఆఫ్ ఎఫెన్స్, ప్రమాదానికి సంబంధించిన డాక్యుమెంట్లు తదితర 27 ప్రశ్నలు అడిగానని తెలిపారు.
దీనిపై పోలీసు వారు డాక్యుమెంట్లు ఇవ్వడానికి లేదని, ఇవి పబ్లిక్ డాక్యుమెంట్లు కాదని, పైగా కేసు దర్యాప్తులో ఉందని సమాచారం ఇచ్చేందుకు దాటవేశారని అన్నారు. తప్పులన్నీ పోలీసులు వద్ద పెట్టుకొని మమ్మల్ని అంటే ఎలా అని ప్రశ్నించారు. మీటింగ్ పెట్టుకోవద్దని అనడం సరికాదని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ నుద్దేశించి మాట్లాడుతూ లోకేష్ ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన చేస్తున్నామని అన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైలుకెళ్లి తను సంఘీభావం ప్రకటించానని, పోలీసులు అడ్డుపెట్టుకొని మమ్మల్ని అడగదొక్కుతారా అని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల హత్యపై రీ పోస్టుమార్టం చేయిస్తామని అన్నారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభ జరగనివ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ప్రవీణ్ ప్రగడాల హత్య వెనుక చాలా పెద్ద హస్తమే ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
రాధా మనోహర్ దాసు, కరుణాకర్, లలిత మోడీ వంటి వాళ్ళ ప్రమేయం లేదని వాళ్ళని అనవసరంగా అరెస్టు చేశారని వాళ్ల ను అరెస్టు చేయమని మేము చెప్పామా ? అని ప్రశ్నించారు. ప్రవీణ్ ప్రగడాల సంస్కరణ సభకు ఒకరోజు ముందుగానే 50 మంది బిషప్ లు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని క్రైస్తవ సంఘాలు యువజన సంఘాలు ఈ సభకు తరలి వస్తున్నాయని ఎక్కడైనా ఆపితే అక్కడకక్కడే ధర్నా చేసి అక్కడే సభ నిర్వహిస్తారని, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని దానికి బాధ్యులు పోలీసులే అవుతారని పేర్కొన్నారు. ఎవరిని రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు ఉండవని, శాంతి యుతంగా సభ నిర్వహిస్తామని, దానిని పరిక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


