Bus Service : బస్సు సర్వీ సులకొరత

TRINETHRAM NEWS

ప్రయాణికుల నిత్యం కలత.

దేవరకొండ నుండి డిండి కి రాత్రి ఏడు దాటితే బస్సులు ఉండవు. …
రాత్రి 9:30 గంటలకు కర్నూలు బస్సు….
కర్నూలు బస్సు కొరకు ప్రయాణికుల నిరీక్షణ…
బస్సు రానట్లయితే ఆ రాత్రి బస్టాండ్ లోనే ప్రయాణికుల జాగారం…..
పేరుకే దేవరకొండ డిపో ఉంది .. రాత్రిపూట డిండి కి బస్సు సర్వీసు వేయకపోవడం విడ్డూరం……
ప్రయాణికుల బాధలను పట్టించుకోని దేవరకొండ డిండి ఆర్టిసి అధికారులు…….
దేవరకొండ మే 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం జనాభా పెరుగుతున్న కొద్దీ ఆర్టీసీ తన సేవల్ని విస్తృతం చేయాల్సింది పోయి అందుకు విరుద్ధంగా బస్సు సర్వీసులను తగ్గించి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. నిత్యం బస్సు సర్వీసులపై ఆధారపడి రాకపోకలు సాగించి పేద మధ్యతరగతి ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో నివాస ఉంటున్న వారు నగరంలోని వాణిజ్య సముదాయాలు దుకాణాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగులుగా పని చేస్తున్నారు రాత్రి 9 గంటలకు విధులను ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళేందుకు బస్టాప్లను వేరే సరికి ఆర్టీసీ బస్సులు ఉండటం లేదు గతంలో డిండి. T,,గౌరారం, ఎర్రారం చెరుకుపల్లి , బొగ్గుల దోన, ప్రాంతాలకు పదుల సంఖ్యలో బస్సు సర్వీసులు ఉండేవి, క్రమంగా బస్సు సర్వీసులను తగ్గించి ఇప్పుడు వాటిని నాలుగు నుంచి ఐదు వరకు తగ్గించేసి రాత్రి సమయంలో దేవరకొండ బస్టాండ్ చేరుకునే వారికి అనుకూలంగా ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపలేక పోతుంది.
బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల నుండి అధిక డబ్బులు లాగుతున్నారు. రద్దీని దృష్టి పెట్టుకొని డిండి రూట్ లో ప్రత్యేక బస్సులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇప్పటికైనా దేవరకొండ ఆర్టిసి అధికారులు స్పందించి, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా, డిండి రూట్ లో రాత్రి 8 గంటల నుండి,8-30 గంటల మధ్య లో డిండి రూట్ లో బస్సు సర్వీసులు నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ప్రయాణికులే ఆర్టీసీ సంస్థకు నిధి అని సూక్తులు బస్సులో రాసి, వాటిని పాటించకపోవడం ప్రయాణికుల ఇబ్బంది తెలియకపోవడం విడ్డూరం అని ప్రయాణికులు వాపోతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bus service is slow

You cannot copy content of this page

Scroll to Top