Lost Cell Phones : పోగొట్టుకున్న సెల్ ఫోన్లు అప్పగింత

TRINETHRAM NEWS

21 సెల్ ఫోన్లు అప్పగింత : ఏ ఎస్ పి మౌనిక.
దేవరకొండ మే 15 త్రినేత్రం న్యూస్. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో (సీ ఈ ఐ ఆర్) పోగొట్టుకున్న ఫోన్లను వెతికి పట్టుకోవడంలో దేవరకొండ పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 21 మంది పోగొట్టుకున్న సెల్ఫోన్లను దేవరకొండ పోలీసులు కనిపెట్టి బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఏ ఎస్ పి మౌనిక మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక ను వినియోగించి పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించవచ్చనిదీనివల్ల వ్యక్తిగత సమాచార భద్రత కూడా వుంటుందని అన్నారు మనవివరాలను నమోదుచేసి లాక్ చేయవచ్చని, మొబైల్ దొరికిన తర్వాత అన్ లకు చేసుకునే సౌలభ్యం వుంటుందని అన్నారు. ఇప్పటివరకు సబ్ డివిజన్ పరిధిలో చాలామంది ఫోన్లను గుర్తించి అప్పగించినట్లు పేర్కొన్నారు
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పోగొట్టుకున్న తమ ఫోన్లను కనిపెట్టి పోలీసులు అందించటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సెల్ ఫోన్ బాధితులంతాపోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సెల్ ఫోన్లను రికవర్ చేయడంలో దేవరకొండ s h o నర్సింహులు, ఎస్ఐ లు అజ్మీరా రమేష్,రవ్వకోటేశ్, పీ మౌనిక, షేక్ చాంద్ పాషా రైటర్,గెలుమొనియ,గుగులోతు రాజారాం రైటర్, వరలక్ష్మి, ఇమ్రాన్ లను ఏ ఎస్ పి మౌనిక అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Lost cell phones handed

You cannot copy content of this page

Scroll to Top