అల్లూరిజిల్లా అరకువేలి: త్రినేత్రం న్యూస్ మే 16: అరకు నియోజకవర్గంలోని గన్నెల పంచాయతీ గన్నెల గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు చిట్టం నాయక్ బలబద్దర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, వీఆర్పీలకు గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం వల్ల వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికీ వారి వేతనాలు విడుదల చేయకపోవడం దురదృష్టకరమని అభిప్రాయపడిన ఆయన, ఈ తక్షణ సమస్యపై జిల్లా అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కార్మికులకు రెండు నెలలుగా బకాయిలు చెల్లించకుండా పనులు చేయించడమే జరుగుతోందని ఆరోపించారు.
కార్మికుల జీవితాలు ఆర్థికంగా బలహీనపడుతున్నాయని, వారి కుటుంబ పోషణకు ఇది పెద్ద సవాలుగా మారిందని చిట్టం నాయక్ చెప్పారు. ఇంకా ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కార్మికులకు మెడికల్ కిట్లు, త్రాగునీరు, టెంట్లు వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అందుబాటులో లేవని తెలిపారు.
ఈ నేపథ్యంలో, వీఆర్పీలకు వేతనాలు, ఉపాధి హామీ కార్మికులకు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


