అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ మే 16: రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఆదివాసుల్లో ఆనందాన్ని నింపింది. గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాలను 100% స్థానిక గిరిజనులకే కేటాయించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో గిరిజనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
గతంలో రద్దయిన జీవో నెంబర్ 3కు ప్రత్యామ్నాయంగా కొత్త జీవోను తీసుకురాబోతున్నట్లు సీఎం ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక నాలుగు కూడలి జంక్షన్ వద్ద చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ శివేరి ధోన్నుదొర, స్థానిక సర్పంచ్ పెట్టేలీ దాసు బాబు, టీడీపీ నాయకులు బాబురావు, అమ్మన్న, మహదేవ్, బూరు బోరులక్ష్మి, నీరజ, బూర్జ్యలక్ష్మి, చందు, నాగరాజు, గౌరీ, తుల్లావతి, మిన్ను, సదానందం తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఆదివాసుల సంక్షేమానికి మేలుగా పరిగణిస్తున్నామని వారు పేర్కొన్నారు. స్థానిక గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


