ఇప్పటికే 1.2 కిలో మీటర్లు పనులు పూర్తి
మిగతా 2 కిలో మీటర్ల పనులు త్వరలో పూర్తి చేయిస్తాం
నగరానికి కీలకమైన ఎన్.ఆర్.సి. పైపులైన్ పనులు పరిశీలించడం జరిగింది
అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
(రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్, రాజమండ్రి నగరలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం మురుగునీరు మళ్ళించేందుకు ఎంతో కీలకమైన ఎన్.ఆర్.సి. పంపింగ్ స్టేషన్ పైపు లైన్ పనులు త్వరలో పూర్తవుతాయని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు.
బుధవారం ముగ్గుపేట వద్ద జరుగుతున్న పైపులైన్ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ…నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలవకుండా మళ్ళించేందుకు లింగంపేట వాంబే గృహాల వద్ద ఉన్న ఎన్.ఆర్.సి పి.పి. పంపింగ్ స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 450 హెచ్.పి. సామర్థ్యంతో నెలకొల్పిన ఈ పంపింగ్ స్టేషన్ వద్ద నుంచి పైపులైన్ స్వతంత్ర ఆసుపత్రి, దేవీ చౌక్, ఆజాద్ చౌక్, ముగ్గుపేట, శీలం నూకరాజు లే అవుట్, కిమ్స్ ఆసుపత్రి, పెట్రోల్ బంక్, షెల్టాన్ హోటల్ మీదుగా 3.5 కి.మీ ప్రవహించి ఆవలో కలుస్తుందని చెప్పారు. 15 సంవత్సరాల క్రితం వేసిన ఆర్.సి.సి. పైపులైన్లు తుప్పు పట్టి కాలక్రమేణా దెబ్బతిని నీరు లీకవ్వడం వల్ల ఏడాది క్రితం ముగ్గుపేట వద్ద భూమి కుంగిపోయి లారీ దిగబడి పోయిందని చెప్పారు. నాడు ప్రతిపక్ష నాయకునిగా రోడ్డు దెబ్బతిన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు.
అలాగే శీలంనూకరాజు లే అవుట్, పెట్రోల్ బంక్ వద్ద కూడా రోడ్డు కుంగిపోయిందని ఆయన చెప్పారు. కాని ఆనాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పైపులైన్ పనుల కోసం ఫేజ్ -1 లో కార్పొరేషన్ జనరల్ నిధులు రూ.97 లక్షలతో 440 మీటర్ల పనులను శీలం నూకరాజు రోడ్డు వద్ద తాను ప్రారంభించామని చెప్పారు. దెబ్బతిన్న ఆర్.సి.సి. పైపుల స్థానంలో నాణ్యత కలిగి ఎక్కువ కాలం పని చేసే డిఐ పైపులు వేయిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం శీలం నూకరాజు రోడ్డువద్ద పైపులైన్ పనులు పూర్తి అవ్వడంతో పాటు రోడ్డు పనులు కూడా పూర్తయినట్లు చెప్పారు. ప్రస్తుతం 15 వ ఆర్థిక సంఘం నిధులు రూ. 1.20 కోట్లతో ముగ్గుపేట వద్ద పైపులైన్ పనులు కూడా మొదలయ్యాయని, ఇప్పుడు పైపులైన్ పనులు వేగం పెంచి పూర్తి నాణ్యతతో 1.2 కి.మీ పూర్తి చేయించగలిగా మన్నారు. మిగతా 2 కి.మీ పైగా ఉన్న పైపు లైన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. పైపులైన్ పనులు కూడా నాణ్యతతో జరిగేలా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచించారు.
ఈ పర్యటన లో స్థానిక అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


