డిండి మండలం టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్
డిండి (గుండ్ల పల్లి)మే 14 . త్రినేత్రం న్యూస్. డిండి మండలములో నేడు టీ.గౌరారం, తవక్లపూర్, డిండి, గొనబోయినపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అని ఆయన అన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక పోయారు అని అన్నారు.లారీల కొరత లేకుండా చూడాలి ఆయన డిమాండ్ చేశారు.అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనగోలుపై లేదు అని ఆయన అన్నారు.గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్తితిలో ప్రభుత్వం లేదు అని అన్నారు.
తెలంగాణా మాజీ ముఖ్యమంత్రివర్యులు కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు అని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 3 కేజిల వడ్లు కట్ చేస్తున్నారు అని వెంటనే ఆపాలని కోరారు.జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రద్ధ తీసుకొని ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది అని అన్నారు.పాలన చేతకాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అని కోరారు.మంత్రులు గాలిమోటర్ల ప్రయాణాలు తప్ప ఏం లేదు అని ఆయన అన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు.కాంగ్రెస్ వాళ్లు 15,000 ఇస్తాం. అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామన్నారు కానీ ఇప్పుడేమో ఓడ దాటాక బోడ మల్లన్న అన్న విధంగా వ్యవహరిస్తున్నారు అని ఆయన తెలిపారు.
పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం.కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తక్షణమే కాంటా వేయడంలో జాప్యం.కొన్న ధాన్యాన్ని తరలించడంలో జాప్యం.ధాన్యం అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలో జాప్యం,గన్నీ బ్యాగులను సమకూర్చడంలో వైఫల్యం,ధాన్యాన్ని లారీలకు ఎక్కించే హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం, కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం.గొప్పగా చెప్పిన బోనస్ అందజేయడంలో ఘోర వైఫల్యం చెందింది అని ఆయన అన్నారు.తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని అని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజీనేని వెంకటేశ్వర్ రావు పిఎసిఎస్ ఛైర్మన్ మాధవరం శ్రీనివాస్ రావు, మాజీ ఎంపీపీ సలహాదారుడు మాధవరం జనార్దన్ రావు, పిఎసిఎస్ వైస్ ఛైర్మన్ శిమర్ల మల్లయ్య, గొడుగు వెంకటయ్య, రాఘవా చారి,పెద్దులు, డిండి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు గిరమోని శ్రీను,మొహమ్మద్ జహంగీర్,,ఖలీల్,బాసిద్, పీర్ మొహమ్మద్, ఐలేష్ చారి, రమావత్ వెంట్రామ్, రవీందర్ రావు,తండు చంద్రయ్య,బొడ్డుపల్లి జయంత్, కృష్ణయ్య, తిరుపతయ్య తందు శ్రీను,వెంగల్ రావు, గదర్ శ్రీను,గుర్రం సురేష్,డిండి బి ఆర్ ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడురషీద్, నార్య నాయక్,తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


