WhatsApp Image 2024 01 15 at 8.00.22 PM
Trinethram News : సంగారెడ్డి జిల్లా జనవరి 15
సంక్రాంతి పండుగ పూట సంగారెడ్డి జిల్లా ఝరా సంగం మండలంలో సోమవారం విషాదం నెలకొంది.
పొట్‌పల్లి గ్రామంలో గాలపటం ఎగరవేయగా.. అది విద్యుత్ తీగల్లో చిక్కుకుంది. దాంతో గాలిపటం తీసేందుకు ప్రయత్నిస్తుండగా శివకు మార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. తీవ్రంగా గాయ పడిన యువకుడిని వెంటనే చికిత్స కోసం జహీరాబాద్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పొట్‌పల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గాలిపటాలు ఎగరవేస్తూ ఒక్క హైదరాబాద్ లోనే గత మూడు రోజుల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
