General Manoj Naravane : యుద్ధం అంటే బాలీవుడ్ సినిమా కాదన్న

TRINETHRAM NEWS

ఎన్నో కుటుంబాలు ప్రియమైన వారిని కోల్పోవాల్సి ఉంటుందని వ్యాఖ్య

సరిహద్దుల్లో నివసించే వారి పరిస్థితి దారుణంగా ఉంటుందన్న మాజీ ఆర్మీ చీఫ్

యుద్ధం అనివార్యమైతే తప్ప, అది చివరి ప్రత్యామ్నాయంగానే ఉండాలని సూచన

Trinethram News : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందంపై కొందరు ప్రశ్నలు లేవనెత్తుతున్న తరుణంలో, భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ మనోజ్ నరవణె కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధమంటే రొమాంటిక్ వ్యవహారం కాదని, అదొక బాలీవుడ్ సినిమా అసలే కాదని ఆయన స్పష్టం చేశారు. ఘర్షణ వాతావరణానికి స్వస్తి పలికి, దౌత్య మార్గాల ద్వారా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

పుణెలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో జనరల్ నరవణె ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యుద్ధం లేదా హింస అనేవి మనం ఆశ్రయించాల్సిన చివరి మార్గాలు కావాలి. అందుకే మన ప్రధానమంత్రి ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అని అన్నారు. అవివేకులైన కొందరు మనపై యుద్ధాన్ని రుద్దినా, మనం దానిని ప్రోత్సహించకూడదు”

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

War is not a Bollywood

You cannot copy content of this page

Scroll to Top