MLA Nallamilli : మాజీ ఎమ్మెల్యే, సూర్యనారాయణరెడ్డికి పరువూ పాయే, సొమ్ములూ పాయే

TRINETHRAM NEWS

అనపర్తి: త్రినేత్రం న్యూస్ : అనపర్తిలో సోషల్మీడియా టీమ్ తో సమావేశంలో ఎమ్మెల్యే, నల్లమిల్లి మాట్లాడుతూ… మనలో మనకు చిచ్చు పెట్టి దానిని వైయస్సార్ సిపికి అనుకూలంగా మార్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. దానిని ఆదిలోనే తుంచిపడేయాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో కొన్ని సమస్యలను సృష్టించే ప్రయత్నాలను అద్బుతమైన నటనతో చేసారు.

వాటిలో మొదటిది అనపర్తి సావరంలో ఒక అనర్హుడికి పదిహేను వేల రూపాయల పింఛను విషయం. తన పనులు తాను చేసుకుంటూ తిరగగలిగే ఒక వైయస్సార్ సిపి కార్యకర్తకు పోయిన పదిహేను వేల రూపాయిల పించను తిరిగి ఇవ్వాలంటూ ఆ వ్యక్తిని వీల్ ఛైర్ లో తీసుకువచ్చి సూర్యనారాయణరెడ్డి చేసిన నటన అమోఘం. సుత్తి సూరిబాబు, రామవరానికి చెందిన ఆరో వేలు కలసి సూపరింటెండ్ పై నానాయాగీ చేసారు. తీరా లోక్ ఆదాలత్ ఎంక్వైరీలో ఆ వ్యక్తి ఆ ఫింఛనుకి అనర్హుడు అని తేలడంతో అంతటి నటన బూడిదలో పోసినట్లైంది. సుత్తి సూరిబాబుకి తలెక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్దితి ఎదురైంది. మెదడు మోకాలులో ఉన్న వ్యక్తి తలెక్కడ పెట్టకున్నా ఏం లాభమో అర్దం కాదు.

ఇక రెండవది కొత్తూరు శివాలయం విషయంలో తప్పుడు ప్రచారం. నేను బీజేపీ పార్టీలో ఉన్నాననే కారణంతో ఆర్ ఎస్ ఎస్ ని, విహెచ్ పిని, భజరంగ్ దళ్ ని రెచ్చగొట్టాలని చూసి భంగపడ్డారు. గత ఐదు సంవత్సరాలలో ఆలయాల విషయంలో గానీ మత విషయాలలో గానీ సూర్యనారాయణరెడ్డి దంపతులు ఎంత దారుణంగా వ్యవహరించారో నేను ప్రెస్మీట్ లో చెప్పేసరికి ఆయన తల మోకాలు నుండి అరికాలులోకి పోయింది.

ఇక మూడవది. దోమాడ ఘటనలో నానా హైడ్రామా సృష్టించి చివరకు అక్కడా భంగపడ్డారు. తాము తీసిన గోతిలో తామే పడ్డట్లు అయింది.

ఇక పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్యలో మాజీ ఎమ్మెల్యే, కార్యకర్తలకు దైర్యం నింపడానికి పెట్టిన సభలలో ఈ ఆరోవేలు మాట్లాడుతూ పురంధేశ్వరి,చ్చిన సొమ్ములను నేను కైంకర్యం చేసానని ఆరోపణలు చేసారు. నేను ఇటీవల మీటింగ్ లలో దానికి వివరాలు చెప్పమని కోరితే భయపడిపోయి రక్షణ కావాలని హడావిడి చేసారు. ఇక్కడ లోకల్ టాలెంట్ ఉండదు. బయట నుండి గెస్ట్ ఆర్టిస్టులు వచ్చి వాళ్ళకి పావలా పాత్ర ఇస్తే రూపాయి యాక్ట్ చేసేస్తారు.

ఈ ఆరోవేలు ఎన్నికల తర్వాత రాజీబేరాలకు వస్తే మనోళ్ళతో చచ్చిన పాముని ఇంకా కొట్టడమెందుకు వదిలేయండని అన్నాను. కొన్నాళ్ళాగి మళ్ళా యువతపై కామెంట్లు చేస్తే వాళ్ళ ఆగ్రహానికి భయపడి మా గ్రామ పెద్ద రామలింగారెడ్డిగారి ద్వారా బ్రతిమాలడం మొదలు పెట్టాడు

మనల్ని కమ్మరెడ్లు అని కామెంటు చేసిన వీళ్ళలో రెడ్డి పౌరుషం ఏమైపోయిందో అర్దం కాదు. పోయిన ఐదేళ్ళలో ఒక్క టిడిపి కార్యకర్తకూడా ఇలా రాజీబేరాలు ఆడలేదు. ధైర్యంగా పోరాడారు

శకునిమామ స్క్రిప్టులు ఇవ్వడం తగ్గించాక ఈ ఆరోవేలు స్క్రిప్టులు ఇస్తూ రకరకాల మాటలు మాట్లాడాడు. ఇటీవల నేను ఎవరినీ వదిలిపెట్టేది లేదు రాజ్యాంగబద్దంగానే తప్పు చేసిన వారిపై చర్యలుంటాయి అని చెప్పిన నేపధ్యంలో సొంత మెంబర్లు ఈ ఆరోవేలుపై అవిశ్వాసతీర్మానం పెట్టడం, అతను వెళ్ళి మెంబర్లను బ్రతిమాలుకోవడం, వారు వినకపోయేసరికి గత్యంతరం లేక రాజీనామా చేసేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ ఆరోవేలు చేసిన అవినీతి కార్యక్రమాలు కూడా వెలగులోకి వచ్చాయి.

ఇక 20 మంది యంపిటిసిలు ఉండి కూడా బిక్కవోలు యంపిపిని దక్కించుకోలేకపోవడంలో పై నుండి లండన్ పిచ్చోడు ఇచ్చిన వార్నింగ్ తో ఇక్కడ తన నాయకత్వాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్దితి సుత్తి సూరిబాబుకి వచ్చింది. అందుకే రకరకాల కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగమే ఇవి.

దోమాడలో అత్యుత్సాహానికి సుత్తి సూరిబాబుకి రామవరంలో ఒక దెబ్బ తగిలింది. మరో దెబ్బ ఇంకో వారంలో ఆయనకు తగలబోతుంది. దోమాడ ఘటనను మోడి టెర్రరిస్టులపై చేయించిన అటాక్ కి లింకుపెట్టి మాట్లాడే సుత్తి సూరిబాబు అర్ధం చేసుకోవాల్సింది. అక్కడ జరిగేది ఆఫరేషన్ సింధూర.. ఇక్కడ జరిగేది ఆఫరేషన్ చాణక్య. వేచి చూడండి. బిక్కవోలు అయిపోయింది. రామవరం అయిపోయింది. త్వరలో మరొకటి తగలబోతుంది.

లోకల్ గా ఎవరూ సపోర్టు చేయక బయట నుండి గెస్టు ఆర్టిస్టులను తెచ్చుకోవడం వాళ్ళు ఈయనకు గాలి కొట్టడం, ఈయన వాళ్ళకు గాలి కొట్టడం, ఇలా కొట్టి కొట్టి కొబ్బరిబొండాం మూవీలో రాజేంద్రప్రసాద్ లా ఈయన ఉబ్బిపోవడం ఆతర్వాత అందరికీ గాలిపోవడం, భంగపడటం తప్ప సాధించిందేమీ లేదు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA, Suryanarayana Reddy,

You cannot copy content of this page

Scroll to Top