Rain Alert : తెలంగాణ ప్రజలకు రెయిన్ అలర్ట్

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో చల్లని వార్తను అందించింది. వేసవి ఎండలతో సతమతమవుతున్న తెలంగాణలో వచ్చే నాలుగు రోజుల పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

అలాగే వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్న పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన దట్టమైన ఈదురుగాలులతో భారీ వర్షం పడనుంది.

ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లోను తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే కొన్ని జిల్లాల్లో మొత్తం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అలర్ట్ జారీ చేశారు. కాగా గత కొద్ది రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ అకాల వర్షాలు సూర్యతాపం నుంచి ఉపశమనం కలిగిస్తున్నప్పటికి రైతులు, పంటలకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rain alert for the

You cannot copy content of this page

Scroll to Top