Vertex Varma : ప్రజలందరిపై భగవంతుడి ఆశీస్సులు ఉండాలి

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 12 : హైదర్ నగర్ డివిజన్ పరిధి శ్రీనివాసకాలనీలోని పర్వతవర్ధని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి సహిత శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రముఖ భవన నిర్మాణ సంస్థ వర్టెక్స్ అధినేత వేగేశ్న వెంకటరాయ వర్మ (వర్టెక్స్ వర్మ), ధర్మపత్ని లక్ష్మీకుమారి దంపతులు నూతనంగా నిర్మించిన మహా మండపం, రాజగోపురం శిఖర ప్రతిష్ట మహోత్సవాలు ఆదివారం వైభవంగా జరిగాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు, కాలనీవాసుల సమక్షంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య వర్టెక్స్ వర్మ, లక్ష్మీకుమారి దంపతులు మహోత్సవాల్లో శాస్త్రోక్తంగా భక్తిశ్రద్ధలతో పూజలు జరిపించి రాజగోపురం శిఖర ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా వర్టెక్స్ వర్మ మాట్లాడుతూ, ప్రజలందరిపై భగవంతుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకున్నట్లు చెప్పారు.

పాడిపంటలతో ఉభయ తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తుల సౌకర్యార్థం దేవాలయం అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మహా మండపం, నూతన రాజగోపురం నిర్మాణపు దాత వేగేశ్న వెంకటరాయ వర్మ (వర్టెక్స్ వర్మ), ధర్మపత్ని లక్ష్మీకుమారి దంపతులకు కాలనీవాసులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. దేవాలయ ప్రధాన అర్చకులు శనగవరపు యశ్వంత్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా పూజలు జరిగాయి. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు హాజరై పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు, పెద్దసంఖ్యలో కాలనీవాసులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

May God's blessings be

You cannot copy content of this page

Scroll to Top