Health is a Blessing : ఆరోగ్యమే మహాభాగ్యం

TRINETHRAM NEWS

కడియపులంక సర్పంచ్ రాంజీ.

Trinethram News : కడియపులంక (కడియం) : ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని కడియం మండలం కడియపులంక సర్పంచ్ పాఠంశెట్టి వెంకట రామారావు (రాంజీ) అన్నారు. కడియపులంక పంచాయతీ ఆవరణలో బిగ్ టీవీ, రాజమండ్రి ఆకాశం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో కడియపులంక సర్పంచ్ రాంజీ పర్యవేక్షణలో ఆదివారం మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ రాంజీ, ఆకాశం హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ హిమశంకర్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ మాట్లాడుతూ ఎంత ధనవంతుడైన ఆరోగ్యాన్ని కొనలేరని, అనారోగ్యం సోకకుండా నివారించుకోవాలని అన్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతారని డాక్టర్లు సూచనలను తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ఈ వైద్య శిబిరంలో పలువురు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బోడపాటి రాజేశ్వరి, మల్లు బాబీ, కట్టా శివ, గట్టి సూరిబాబు, బండి నాగమణి, పట్టా బాలు, నూనె వెంకటేశ్వరరావు, కోమలి రామకృష్ణ, చీకట్ల చంటి పలువురు పాల్గొన్నారు.

Health is a blessing

You cannot copy content of this page

Scroll to Top