మోసపోయిన బాధితులు, న్యాయం చేస్తామన్న పోలీసులు

TRINETHRAM NEWS

తేదీ : 09/05/2025. యన్ టి ఆర్ జిల్లా : ( త్రినేత్రం న్యూస్ ): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ రెవెన్యూ కాలనీలో పదమూడవ వార్డు డోర్ నెంబరు 40- 03- 10 గల స్నాప్ జిమ్ లో సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు, యువకులు అందులో లక్షల లక్షల్లో, కోట్లు కోట్లు రూపాయలు కట్టి మోసపోవడం జరిగింది. ఫిబ్రవరి లో ప్రేమికుల రోజు ప్రతి నెల పండుగల సందర్భంగా ఆఫర్స్ ఉన్నాయని బాధితుల నుండి జిమ్ యాజమాన్యం డబ్బులు వసూలు చేశారు. అయితే ప్రభుత్వం సంబంధిత అధికారులు మూసి వేయమని నోటీసులు ఇవ్వగా బాధితులకు తెలియకుండా మెయింటింగ్ చేశారు.

ప్రస్తుతం ఇప్పుడు మూసివేసామని చెప్పగా బాధితులు మా డబ్బులు మాకు ఇవ్వమని అడగగా ఆ డబ్బులు వాళ్లకు ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అది భరించలేక బాధితులు మాచారం పోలీస్ స్టేషన్ సి ఐ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన స్పందిస్తూ రక్షక భటులు ఆయన మేము మీకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు బాధితులమైన మాకు న్యాయం చేయాలని కోరారు. బెంగళూరు, విశాఖపట్నం, గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా జిమ్ యాజమాన్యం బాధితులను మోసం చేసిందని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police say they will bring

You cannot copy content of this page

Scroll to Top