Collector Prateek Jain : వైకల్య లోపం ఉన్నవారు స్లాట్ బుక్ చేసుకోండి

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :స్లాట్ బుక్ చేసుకున్న. మెసేజ్ ప్రకారం క్యాంపులకు సకాలంలో హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సదరము యూడిఐడి ద్వారా మే మాసములో వివిధ వైకల్యంలోపం ఉన్న వారు వికారాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ఈనెల 13,16, 21 వ తేదీల్లో అంగవైకల్యం కలవారు, 23 న చెవుడు, మూగ, 27వ తేదీన అందులు, తక్కువ చూపు కలవారు అదేవిధంగా 29వ తేదీన బుద్ధి మాంద్యం /మానసిక వికలత్వము గల సభ్యులకు సదరం యుడిఐడి ద్వారా క్యాంపులు నిర్వహించబడుతాయని కలెక్టర్ తెలిపారు. రెన్యువల్ కు సంబంధించి డిఆర్డిఏ కార్యాలయంలో మే 12 వ తేదీన సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People with disabilities should b

You cannot copy content of this page

Scroll to Top