CITU Demands : అంగన్వాడీలకు పని భారం తగ్గించాలి – సీఐటీయూ ఉమామహేశ్వర్ డిమాండ్

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 10: అరకు వ్యాలీలో మూడు రోజుల ఉద్యమ శిక్షణా తరగతులు ముగింపు సందర్భంగా కీలక వ్యాఖ్యలు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీలో మూడు రోజుల పాటు ఉద్యమ శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు మాట్లాడారు.
అంగన్వాడీలు చేపట్టిన 42 రోజుల సమ్మె చారిత్రాత్మకమైందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్)ను నిర్వీర్యం చేయాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు.
అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు కూడా అంగన్వాడీ వ్యవస్థ వల్ల శిశు మరణాలు తగ్గుతున్నాయని, గర్భిణీలు ఆరోగ్యంగా ఉన్నారని అభిప్రాయపడుతుంటే, పాలకులు మాత్రం ఈ వ్యవస్థను ధ్వంసం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఉమామహేశ్వరరావు అన్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు భద్రత కల్పించి, రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలన్న డిమాండ్‌ను మరోసారి మళ్ళీ ఉద్దేశించారు.
మే 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నూతన లేబర్ కోడ్స్ అమలవుతే కార్మికుల జీవితాలు బానిసలవుతాయని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలతో కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ధనవంతులు, పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చేందుకే ఈ విధానాలను అమలు చేయాలని చూస్తోందని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రేఖ, జిల్లా అధ్యక్షులు కే. భాగ్యలక్ష్మి, కార్యదర్శి డి. నాగమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జాన్ని భగత్ రామ్, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. బి. పోతురాజు, అరకు ప్రాజెక్ట్ నాయకులు లక్ష్మి, సంగీత తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Workload of Anganwadis should

You cannot copy content of this page

Scroll to Top