Heatwave, Rain : నేడు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు

TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి విశాఖపట్నం.. రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. నేడు 42-43.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది..

మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్రంగా, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని మరో 21 మండలాల్లో మోస్తరు వడగాడ్పులు ప్రభావం చూపుతాయని పేర్కొంది. అలాగే అల్లూరి జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Heatwave, rain in North Andhra

You cannot copy content of this page

Scroll to Top