అనపర్తి : త్రినేత్రంన్యూస్. అనపర్తి కెనాల్ రోడ్ లో ఎస్వీఆర్ ఫ్రూట్స్ కంపెనీ వారి నిర్వహణలో గల శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి (ఏడు వాహనాల వెంకన్న) వారి వార్షిక కళ్యాణం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు భోగేశ్వర స్వామి ఆధ్వర్యంలో కళ్యాణబ్రహ్మ ఆగమబ్రహ్మ రామకృష్ణ శర్మ బ్రహ్మత్వంలో స్వామి వారి కళ్యాణ వేడుకలు నిర్వహించారు. గురువారం ఉదయం నాలుగు గంటలకు స్వామివారిని పెండ్లికొడుకును, అమ్మవార్లను పెళ్లి కుమార్తెలను చేయడం జరిగింది. రాత్రి 7 గంటలకు మహేంద్రవాడ గ్రామానికి చెందిన సత్తి పాపిరెడ్డి అరుణ దంపతులు స్వామివారి కల్యాణానికి కళ్యాణ దంపతులుగా వ్యవహరించారు.
ఎస్వీఆర్ ఫ్రూట్స్ కంపెనీ యాజమాన్య ప్రతినిధి సభ్యుల కృష్ణారెడ్డి కళ్యాణ సందర్భంగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామి వారి దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భోగేశ్వర స్వామి మాట్లాడుతూ శనివారం సదస్యం, సోమవారం ఉదయం 5 గంటలకు శ్రీచక్ర స్నానం, 11 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమాలను మల్లిడి కృష్ణారెడ్డి(మయూరి), కలిదిండి వెంకటరాము (సిద్ధాంతి), శ్రీమతి లక్ష్మి, తేతల వీర వెంకట వీర్రాఘవరెడ్డి, సూరంపూడి సూరిబాబు తదితర భక్త బృందం పర్యవేక్షించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


