జూన్ 27, 2026
TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యేటట్లు కనిపి స్తుంది,ఉప్పల్ స్టేడియానికి పిలవని అతిథిగా వరుణు డు వచ్చేశాడు. స‌న్‌రైజర్స్ హైదరాబాద్ ఆశలపై వర్షం నీరు చల్లింది

సోమవారం సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న స‌న్‌రైజర్స్‌ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. వాన కారణంగా స‌న్‌రైజర్స్‌ ఛేజింగ్ ఆలస్యమవుతోంది.

చిరు జల్లుల్లోనే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స‌న్‌రైజర్స్‌ కెప్టెన్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ లో ఇన్నింగ్స్ మధ్యలోనే వర్షం ఆరంభమైంది. కానీ చిరు జల్లులే కురవడంతో ఆ టీమ్ బ్యాటింగ్ కొనసాగించింది.

కానీ ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత వాన ఎక్కువైంది. భారీ వర్షం ఉప్పల్ స్టేడియాన్ని ముంచెత్తింది. దీంతో కవర్లతో గ్రౌండ్ ను కప్పి ఉంచారు. స‌న్‌రైజర్స్‌ ఛేజింగ్ స్టార్ట్ కావడానికి టైమ్ పట్టేలా ఉంది.

మ్యాచ్ రద్దయితే సన్రైజర్స్ హైదరాబాద్ అస్సామే

వర్షం కారణంగా ఢిల్లి క్యాపిటల్స్ తో మ్యాచ్ రద్దయితే స‌న్‌రైజర్స్‌ హైదరాబాద్ కు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ టీమ్ ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమి స్తుంది. ప్రస్తుతం ఈ లీగ్ లో 10 మ్యాచ్ లాడిన స‌న్‌రైజర్స్‌ మూడు మాత్రమే గెలిచింది. ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే ఆ టీమ్ మిగిలిన నాలుగు మ్యాచ్ లు కచ్చితంగా నెగ్గాలి. అప్పుడు ప్లేఆఫ్స్ ఛాన్స్ ఉండేందుకు అవ సరమైన 14 పాయింట్లు వస్తాయి.

ఆ పాయింట్లు
కానీ ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరో పాయింట్ దక్కుతుంది. దీంతో స‌న్‌రైజర్స్‌ పాయింట్ల సంఖ్య 7కు చేరుతుంది. తర్వాతి మూడు మ్యాచ్ ల్లో ఆ టీమ్ గెలిచిన 14 పాయింట్లకు చేరుకోదు. 13 పాయింట్ల దగ్గరే ఆగిపో తుంది. ఈ నేపథ్యంలో వర్షంతో మ్యాచ్ రద్దయితే స‌న్‌రైజర్స్‌ అస్సామే!….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rain dampens Sunrisers Hyderabad

You cannot copy content of this page