Problems of CHCs : సిహెచ్సి ల సమస్యలను డిప్యూటీ సీఎం తక్షణమే పరిష్కరించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : ఏపీ ఎమ్ సి ఏ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిహెచ్సి ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగుతున్న దీక్షకు సోమవారం ఉదయం ఏఐటీయూసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, నగర కార్యదర్శి టి.అన్నవరం సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సిహెచ్సిల సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని, ఈరోజుకి 8 రోజు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన కరువైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షకు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని, సిహెచ్సిల సమస్యలను గౌరవనీయులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తక్షణమే పరిష్కరించాలని ఆయన అన్నారు.

ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్సీలను రెగ్యులర్ చేయాలని, NHM ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ చేయాలని, పని ఆధారిత ప్రోత్సకాలను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనం 35 వేల రూపాయలు చేయాలని, ఈపీఎఫ్ఓ పునర్ధించాలని, క్లినిక్ అద్దె బకాయిలు వెంటనే చెల్లించాలని, క్రమబద్ధీకరించాలని, నిర్దిష్టమైన జాబ్ కార్డు అందించాలని,ఎఫ్ ఆర్ సి నుండి CHO లకు మినహాయింపు ఇవ్వాలని,హెచ్.ఆర్ పాలసీ ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు, తదితర డిమాండ్ల సాధనకే ఈ దీక్షలు జరుగుతున్నాయని ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలని, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, మండుటెండలో మహిళలు దీక్షలు చేస్తున్నారని, ఈ దీక్షలలోఏ ఒక్కరైనా ఎండ దెబ్బకు గురై అనారోగ్యానికి పాలైతే ప్రభుత్వం బాధ్యత వహించాలని ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు రాజు కమిటీ మెంబర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Deputy CM should immediately

You cannot copy content of this page

Scroll to Top