తేదీ : 04/05/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , భీమడోలు వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడం జరిగింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో అటువైపు వెళుతున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తన వాహనాన్ని నిలిపి గాయపడిన వ్యక్తిని పరామర్శించారు.
అదేవిధంగా అంబులెన్స్ కు ఆయనే స్వయంగా ఫోన్ చేసి వైద్యశాలకు తరలించేలా చొరవ తీసుకున్నారు. అనంతరం జిల్లా యస్ పి కి ఫోన్ చేసి క్షత గాత్రుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


