Class 10th Result : పది పరీక్షా ఫలితాల్లో సత్తాచాటిన జగన్నాధపురం పాఠశాల విద్యార్థులు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం.

482/600 మార్కులతో స్కూల్ టాపర్ రూపాస్వాతి

విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయురాలు వెంకటనర్సమ్మ

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ములకలపల్లి మండలం జగన్నాధపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించి తమ సత్తానుసాటగా సి.హెచ్. రూపాస్వాతి 482/600 మార్కులు సాధించి స్కూల్ టాపర్ గా నీలవగా, యం. జాహ్నవి 455/600, కె. మేఘన 443/600, యం. మనీషా 443/600 మార్కులు సాధించారని మిగిలిన విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలను సాధించడం తమ పాఠశాలకు ఎంతో గర్వంగా ఉందని విద్యార్థులందరికీ తన తరపున ఉపాధ్యాయుల తరపున అభినందనలు తెలుపుతున్నానని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. వెంకటనర్సమ్మ తెలిపారు.

అలాగే ప్రధానోపాధ్యాయురాలు పి. వెంకటనర్సమ్మ మాట్లాడుతూ జగన్నాధపురం ఉన్నత పాఠశాల నుండి తెలుగు / ఇంగ్లీష్ మీడియం ద్వారా మొత్తం 25 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా వారి నుండి 23 మంది ఉత్తీర్ణులై 92 శాతం ఫలితాలను సాధించడం జరిగిందన్నారు.తెలుగు మీడియంలో 10/11, ఇంగ్లీష్ మీడియంలో 13/14 మంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారన్నారు. ఫెయిల్ అయిన ఇరువురు విద్యార్థులు ఒక్కో సబ్జెక్టులలో మాత్రమే ఫెయిల్ కావడం జరిగిందనీ వెంకటనర్సమ్మ తెలిపారు.

తమ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడానికి తమ పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పట్ల తీసుకున్న వ్యక్తిగత శ్రద్ధతోపాటు తమపై అధికారులు అందించిన సహాయ సహకారాలు, విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహం, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అందించిన సహాయ సహకారాలు కారణమన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడానికి అధికారుల సహాయ సహకారాలతో కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయురాలు వెంకటనర్సమ్మ తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jagannadhapuram school students excel

You cannot copy content of this page

Scroll to Top