గాంధీ లాంటి సౌమ్యుడైన డాక్టర్,ని అల్లూరిగా మార్చి తప్పు చేస్తున్నారంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లిని హెచ్చరించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా
అనపర్తి: త్రినేత్రం న్యూస్ : శాంతికి మారుపేరుగా మంచితనానికి మచ్చుతునకుగా నలుగురికి తనకు చేతనైన సాయం చేస్తూ సౌమ్యంగా గాంధీ,లా ఉండే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి,ని అల్లూరి సీతారామరాజులా రామకృష్ణారెడ్డి మారుస్తున్నాడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా అన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నియోజకవర్గం లో జరుగుతున్న ఒక్కో ఘటన ఒక్కొక్క సంఘటనలతో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, రోజు రోజుకి రాటు తేలుతున్నారని ఇక ఆయన్ని తట్టుకోవడం ఎమ్మెల్యే నల్లమిల్లి వల్ల కాదంటూ జక్కంపూడి రాజా ప్రస్తావించారు.
అనపర్తి నియోజకవర్గంలోని పెదపూడి మండలం దోమాడ గ్రామంలో అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,పై గురువారం రాత్రి కూటమి మూకలు దాడికి పాల్పడడానికి యత్నించిన సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి,కి సంఘీభావం తెలపడంతో పాటు, ఈ విషయంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నాయకత్వంలో రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ తానేటి వనిత, రాష్ట్ర పార్టీ యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా, కొవ్వూరు నియోజకవర్గం వైకాపా ఇన్చార్జ్ తలారి వెంకటరావు, తదితర జిల్లా పార్టీ నాయకులు శుక్రవారం అనపర్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,పై యత్నించిన దాడి ఘటనను వదిలిపెట్టిది లేదని, ఈ ఘటనను రాష్ట్రస్థాయిలో ప్రతిఘటించడం జరుగుతుందని రాజా అన్నారు.
ప్రజాస్వామ్యంలో రౌడీయిజం ఎల్లకాలం చెల్లదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం చేయాలనుకుంటే అనపర్తి నియోజకవర్గం లో ఏ గ్రామంలో కూడా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తిరగనీయకుండా చేయగలమని రాజా హెచ్చరించారు.
దీనికి ముందుగా మాజీ మంత్రి గోపాలపురం వైకాపా ఇంచార్జ్ డాక్టర్ తానేటి వనిత, కొవ్వూరు నియోజకవర్గ వైకాపా ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు గారు అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అనపర్తి మండల పార్టీ కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి అనపర్తి మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొల్లాటి ఇజ్రాయిల్ అనపర్తి గ్రామ పార్టీ కన్వీనర్ మురళీమోహన్ బాలకృష్ణారెడ్డి, అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


