Bandi Ramesh : శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవా కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : వరంగల్ లోని శ్రీ భద్రకాళి భద్రేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలు శుక్రవారం భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవోపేతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బoడి రమేష్ ముఖ్యఅతిథిగా సతి సమేతంగా హాజరయ్యారు. ఆలయ పూజారులు రమేష్ దంపతులకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. రమేష్ దంపతులతో ప్రత్యేక పూజలు నిర్వహింపచేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనటం అదృష్టంగా భావిస్తున్నానని దేవేరుల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. నిర్వాహకులు భక్తులకు అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh participated in

You cannot copy content of this page

Scroll to Top