డిండి (గుండ్ల పల్లి) మే 1 త్రినేత్రం న్యూస్ : డిండి, మే 1,డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గురువారం దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి సందర్శించారు. బుధవారం డిండిలో కురిసిన భారీ వర్షానికి మార్కెట్లోని ధాన్యం తడిసిన దృష్ట్యా, సందర్శించి రైతులకు భరోసా కల్పించారు. రైతులకు సకాలంలో టార్పాలు అందించాలని, మంచి నీటి వసతిని, టెంట్లను ఏర్పాటు చేయాలని ఇతర వసతుల ను కల్పించాలని ,సీఈఓ కు సూచించారు.
ధాన్యం మ్యాచర్ ను పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారని రైతులు దిగులు పడవద్దని ,రైతులకు ధైర్యం చెప్పారు .ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ ఆంజనేయులు, సీఈవో బాల్రెడ్డి ,రైతులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


