MLA Jare : చెరువులు నిండుగా ఉంటేనే పల్లెలు బాగుంటాయి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం. ఇందిరమ్మ, చెరువు బాట కార్యక్రమం కింద చెరువుల, పునరుద్ధరణకు నూతన శకం ప్రారంభమైంది. ఈ క్రమంలో అశ్వారావుపేట మండలంలో పలు గ్రామాల్లో చెరువులు కుంటలు పంట కాలువల మరమ్మత్తులకు శంకుస్థాపన లో భాగంగా, అచ్యుతాపురం నరసింహ సాగర్ వద్ద కార్యక్రమాన్ని ,ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ చెరువు బాట పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాగునీరు త్రాగునీరు భూగర్భజలాలను, మెరుగుపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అన్నారు. చెరువులు నిండుగా ఉంటే రైతన్న సంతోషంగా ఉంటాడని ఈ కార్యక్రమం ద్వారా రైతులకు నిజమైన మేలు చేకూరుతుంది అని తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న నిధులను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని. అభివృద్ధి వైపు పయనించాలన్నారు ఇందిరమ్మ, ఇండ్లు రైతు భరోసా ప్రభుత్వ బడుల్లో, మౌలిక వసతుల అభివృద్ధి వంటి ఇతర పథకాలతో సమన్వయంగా చెరువుబాట కూడా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,తుమ్మా.రాంబాబు, ఇరిగేషన్ డి.ఇ,ఎల్. కృష్ణ, ఏ. ఇ కే.ఎన్.బి కృష్ణ, ఆర్.ఐ పద్మ,జూపల్లి రమేష్. జూపల్లి.ప్రమోద్,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు రైతులు గ్రామ శాఖ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Villages are good only

You cannot copy content of this page

Scroll to Top