త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం
అనారోగ్య బాధితులకు భరోసాగా నిలుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే జారె
తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల ఆరోగ్య రక్షణ అత్యవసర చికిత్సలు ఆర్ధిక అవసరాలను తీర్చడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దిశగా గౌరవ శాసనసభ్యులు జారె ఆదినారాయణ… వారి సిఫారసు ద్వారా మంజూరైన చెక్కులను బాధితులకు చండ్రుగొండ మండల కేంద్రంలోని రైతువేదిక నందు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజల కష్టాలలో భాగస్వామ్యమై వారి కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలబడటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎల్వోసీల రూపంలో మంజూరు చేస్తుందని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని గతంలో 5 లక్షల పరిమతి ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి అనేకమంది ప్రాణాలు నిలిచేలా చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అశోక్ కుమార్, ఎమ్మార్వో సంధ్యారాణి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


