District Collector : అక్రమ కట్టడం తొలగించాలని జిల్లా కలెక్టరు కు ఫిర్యాదు

TRINETHRAM NEWS

మండపేట : త్రినేత్రం న్యూస్ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం ఆలమూరు గ్రామ పరిధిలో వినాయక కన్వెన్షన్ హాల్ పేరుతో హెచ్ పి పెట్రోల్ బంకును ఆనుకొని నిర్మాణం చేసియున్నారు. సదరు నిర్మాణమును నిబంధనలకు విరుద్ధముగా తప్పుడు పర్మిషన్లు పొంది పంచాయతీ అధికారులు, రుడా ప్లానింగ్ అధికారులు, జిల్లా అగ్నిమాపక అధికారి, విలేజి సర్వేయర్ మరియు మండల సర్వేయర్లు తో కుమ్మకు అయ్యి తప్పుడు పద్ధతిలో పర్మిషన్లు పొంది నిర్మించిన నిర్మాణమును తొలగించాలని పొందిన పర్మిషన్లు రద్దు చేయాలని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించాలని కోనసీమ జిల్లా కలెక్టర్,కి పూర్తి ఆధారాలను సమర్పించిన ఆర్టిఐ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రెటరీ వారా రాజశేఖర్ కోరి ఉన్నారు వారితో పాటు పాత్రికేయ మిత్రులు పాల్గొని యున్నారు ఈ విషయంపై రాజశేఖర్ మాట్లాడుతూ త్వరలో డి జి ఫైర్ ఆఫీసర్ విజయవాడ, అలాగే ప్రిన్సిపల్ సెక్రెటరీ సెక్రటేరియట్ వారిని కూడా కలిసి ఆధారాలతో సహా వారికి సమర్పించి ఫిర్యాదు చేస్తానని తెలియజేసినారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Complaint to the District Collector

You cannot copy content of this page

Scroll to Top