MLA Satyananda Rao : ధాన్యం కొనుగోలులో సమస్యను పరిష్కరించండి

TRINETHRAM NEWS

కలెక్టర్,సివిల్ సప్లై ఎండీ ని కోరిన ఎమ్మెల్యే సత్యానందరావు
కొత్తపేట:త్రినేత్రం న్యూస్ : అంబేద్కర్ కోనసీమ జిల్లా, ధాన్యం కొనుగోలలో ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్,సివిల్ సప్లై ఎండీ మనజీర్ జిలానీ సమూన్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఫోన్ ద్వారా సంభాషించి కోరడం జరిగింది.ఆలమూరు మండలం గుమ్మిలేరు గ్రామం నుండి మోదుకుర్రు గ్రామం వెళ్తుండగా రైతుల సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే వారి వద్ద ఆగి విషయాన్ని తెలుసుకున్నారు.సమస్యను పై అధికారులతో మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే తెలియజేశారు.తమ గోడును విని సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే సత్యానందరావు తెలియజేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Solve the problem in

You cannot copy content of this page

Scroll to Top