Dokka Seethamma : వంపూరు గంగులయ్య నివాళి

TRINETHRAM NEWS

డొక్కా సీతమ్మ సేవలు నేటికీ ప్రజలకు మార్గదర్శకం

అల్లూరి సీతారామరాజు జిల్లా, త్రినేత్రం న్యూస్ పాడేరు: ఏప్రిల్ 29: ఆంధ్రుల అన్నపూర్ణగా ప్రసిద్ధి పొందిన, మానవత్వానికి ప్రతిరూపమైన డొక్కా సీతమ్మ సేవలను జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య కొనియాడారు. ఓ పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, విశ్వ మానవతకు అద్దం పట్టిన మహిళగా డొక్కా సీతమ్మ నిలిచారని ప్రశంసించారు.
ఆంధ్రప్రదేశ్ కీర్తిని ఇంగ్లాండ్ వరకు వ్యాపింపజేసిన ఆమె, అమ్మ ప్రేమను అన్నార్దులకు పంచి జీవితాన్ని మహత్తరంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. “డొక్కా సీతమ్మ చేసిన నిరంతర సేవలు నేటికీ కథలుగా వినిపిస్తూ ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఆమె ఆత్మీయత, సేవాభావం ఈ తరం తరాలకు మార్గదర్శనం,” అని గంగులయ్య తెలిపారు.
400 ఎకరాల భూమిని అమ్మి, ఆకలితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ గొప్పతనాన్ని వివరించిన ఆయన, జనసేన అధినేత మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ కూడా డొక్కా సీతమ్మ గురించి చెప్పిన మాటలు తనను ఎంతో ప్రేరేపించాయని అన్నారు.
డొక్కా సీతమ్మ చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆమెను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం జూనియర్ కళాశాల మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టినందుకు హర్షం వ్యక్తం చేశారు.
“అన్ని దానాల్లో అన్నదానం ఉత్తమమైనది. ప్రతి వచ్చినవారికి కడుపునిండా అన్నం పెట్టిన డొక్కా సీతమ్మ వంటి మహనీయుల జీవితం నేటి తరం వారికి తెలుసుకోవడం అత్యంత అవసరం,”అని గంగులయ్య స్పష్టం చేశారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున ఘన నివాళులు అర్పించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Tribute to Vampuru Gangulayya

You cannot copy content of this page

Scroll to Top