CPI : కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి

TRINETHRAM NEWS

అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ
డిండి (గుంఫ్లపల్లి) ఏప్రిల్26 త్రినేత్రం న్యూస్
కాశ్మీర్ పహాల్గంలో పర్యాటకులపై దాడులు చేసిన ఉగ్రవాదులను అంతమొందించాలి…
అమరులకు కొవ్వొత్తులతో నివాళులు అర్పించిన సిపిఐ…

కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసారని,కేంద్రం ప్రభుత్వం నష్టనివారణ చర్యలకై పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి అన్నారు.శనివారం డిండి మండల కేంద్రంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఉగ్రదాడిలో మరణించిన భారత పౌరులకు నివాళులు అర్పించారు.

ఈ సందర్బంగా కనకాచారి మాట్లాడుతూ చనిపోయిన వారికీ కోటి రూపాయలు,గాయపడిన పౌరులకు 25 లక్షల నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.కాశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన జిహాదీ పాక్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను గుర్తించి అంతమొందించాలని,ఉగ్రదాడికి కారణమైన పాక్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలని,వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సామాన్య పౌరులపై ఉగ్రవాదులు దాడులు హేయమైన చర్య అని,ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో అలజడి సృష్టించడమే పాక్ ప్రధాన ఉదేశ్యమని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం చెందిందని ధ్వజమెత్తారు.దేశ వ్యాప్తంగా ఉన్న పౌరులంతా
ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని కనకాచారి పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయకుండా పాకిస్తాన్ కీ తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేసారు.ఈ ఘటనలో గాయలైన వారికీ కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్యం అందించాలని డిమాండ్ చేసారు.దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ముక్తఖంటంతో ఈ చర్యను వ్యతిరేకిస్తూ మద్దతు పలుకుతున్నాయని అన్నారు. మృతి చెందిన భారత పౌరుల కుటుంబాలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )డిండి మండల సమితి పక్షాన ప్రగాఢ సానుభూతిని,సంతాపం వ్యక్తం చేశారు.మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం దీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పాలని అన్నారు.ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొల్లె సైలేష్,కార్యవర్గ సభ్యులు నూనె వెంకటేశ్వర్లు,ఎలిమినేటి హుస్సేన్,నాయకులు వంకేశ్వరం చక్రి, నూతనగంటి హనుమంత్,బూసిపాక లింగమయ్య, జవహర్ లాల్,సూరిగి వినయ్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిఘా సంస్థల వైఫల్యం కారణంగానే కాశ్మీర్ లోని పహాల్గంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసారని,కేంద్రం ప్రభుత్వం నష్టనివారణ చర్యలకై పర్యాటకులపై బుల్లెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను అంతమొందించాలని సిపిఐ డిండి మండల కార్యదర్శి శ్రీరామదాసు కనకాచారి అన్నారు.శనివారం డిండి మండల కేంద్రంలో హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై కొవ్వొత్తులతో ప్రదర్శన, ర్యాలీ నిర్వహించారు.అనంతరం
ఉగ్రదాడిలో మరణించిన భారత పౌరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా కనకాచారి మాట్లాడుతూ చనిపోయిన వారికీ కోటి రూపాయలు,గాయపడిన పౌరులకు 25 లక్షల నష్టపరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.కాశ్మీర్లో పర్యాటకులను కిరాతకంగా చంపిన జిహాదీ పాక్ ప్రేరేపిత లస్కరే తోయిబా ఉగ్రవాదులను గుర్తించి అంతమొందించాలని,ఉగ్రదాడికి కారణమైన పాక్ ప్రభుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒంటరి చేయాలని,వాణిజ్య, వ్యాపార, పర్యాటక రంగాలపై ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సామాన్య పౌరులపై ఉగ్రవాదులు దాడులు హేయమైన చర్య అని,ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో అలజడి సృష్టించడమే పాక్ ప్రధాన ఉదేశ్యమని, ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కేంద్రం ప్రభుత్వం విఫలం చెందిందని ధ్వజమెత్తారు.దేశ వ్యాప్తంగా ఉన్న పౌరులంతా
ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని కనకాచారి పిలుపునిచ్చారు.కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకొనే ప్రయత్నం చేయకుండా పాకిస్తాన్ కీ తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేసారు.ఈ ఘటనలో గాయలైన వారికీ కేంద్ర ప్రభుత్వం అత్యాధునిక వైద్యం అందించాలని డిమాండ్ చేసారు.దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ముక్తఖంటంతో ఈ చర్యను వ్యతిరేకిస్తూ మద్దతు పలుకుతున్నాయని అన్నారు. మృతి చెందిన భారత పౌరుల కుటుంబాలకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )డిండి మండల సమితి పక్షాన ప్రగాఢ సానుభూతిని,సంతాపం వ్యక్తం చేశారు.మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం దీటుగా పాకిస్తాన్ కు బుద్ది చెప్పాలని అన్నారు.ఈ కొవ్వొత్తుల ప్రదర్శన ర్యాలీలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి బొల్లె సైలేష్,కార్యవర్గ సభ్యులు నూనె వెంకటేశ్వర్లు,ఎలిమినేటి హుస్సేన్,నాయకులు వంకేశ్వరం చక్రి, నూతనగంటి హనుమంత్,బూసిపాక లింగమయ్య, జవహర్ లాల్,సూరిగి వినయ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Terrorists who attacked tourists

You cannot copy content of this page

Scroll to Top