జూన్ 26, 2026
TRINETHRAM NEWS

మండపేట : త్రినేత్రం న్యూస్ : మండపేట పట్టణంలో నాళంవారి వీధి బురుగుంట చెరువుగట్టు వద్ద ఉన్న శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వరస్వామి వారి కళ్యాణ మండపంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చేనేత సొసైటీ ప్రతినిధుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్యఅతిధిగా హాజరైనారు. ఈ సంధర్బంగా చేనేత ప్రతినిధులు మాట్లాడుతూ చేనేత సంఘాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎమ్మెల్యే కు వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ చేనేత సమస్యలపై తాను గతంలోనే అసెంబ్లిలో మాట్లాడానని, రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులలో ఉన్న కారణంగా నిధుల కొరత ఉన్నప్పటికీ చేనేత అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ , నారా లోకేష్ , కృత నిశ్చయంతో ఉన్నారని తొందరలోనే చేనేత సమస్యలను మరొకసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీ విశ్వనాధం, ఆప్కో మాజీ డైరెక్టర్ ముప్పన వీర్రాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్లు చింతా వీరభద్రేశ్వరావు, అంకం వీర్రాజు, మండపేట చేనేత కార్యదర్శి వెదుళ్ల గణపతి, వివిధ చేనేత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Vegulla at the

You cannot copy content of this page