Cowardly Act : ఉగ్రవాదుల దాడి పిరికిపంద చర్య

TRINETHRAM NEWS

కొత్తపేట జనసేన ఇన్‌చార్జి బండారు శ్రీనివాస్ ఆగ్రహం

ముష్కర మూకలను కఠినంగా శిక్షించాలని డిమాండు

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ పిలుపుతో బారీ నిరసన ర్యాలీలు

బారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులు…

Trinethram News : ఆలమూరు : త్రినేత్రం న్యూస్ : విభిన్న మతాలు, వివిధ కులాల కలయికతో పటిష్టంగా ఉన్న భారత దేశ ఔన్నత్యాన్ని కాపాడేందుకు పౌరులందరూ ఒక్కొక్క సైనికుడిగ మారాలని అదే ఉగ్రదాడిలో అసువులు బాసిన పర్యాటకులకు ఘనమైన నివాళి అని కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి బండారు శ్రీనివాసు అన్నారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం కోణిదల పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఆలమూరులో నల్ల కండువాలను ధరించి బారీ ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్‌ డౌన్‌ డౌన్‌–భారతీయుల ఐక్యత వర్థిల్లాలి– భారతమాతకు జై అంటూ నినాదాలు చేశారు.

ఈసందర్భంగా నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాసు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కొనలేని పాకిస్తాన్‌ పెంచి పోషిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామని హెచ్చరించారు. భారత దేశ ఐక్యతను. సమగ్రతను ఈఉగ్రదాడులు ఏమీ చేయలేవన్నారు. దేశంలో అంతర్భాగమైన జమ్ము కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రదాదులు అమాయకమైన పర్యాటకులపై జరిపిన దాడి నీతి బాహ్యమైన పిరికపంద చర్యగా అభివర్ణించారు.

ఈఉగ్రదాడిని ప్రధాని నరేంద్రమోదీ సీరియస్‌గా తీసుకుని ముష్కర మూకల ఏరివేతకు చర్యలు ప్రారంభించారన్నారు. ఈఉగ్రదాడికి చలించిపోయిన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించడం ఆయనకు దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అనంతరం ఉగ్రదాడిలో అసువులు భాసిన 28 మంది పర్యాటకుల ఆత్మకు శాంతి కలగాలని కొద్దిసేపు మౌనం పాటించారు, మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

జనసేన పార్టీ నేతృత్వంలో బారీ నిరసన ప్రదర్శనలు…

జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గంలోని కొత్తపేట, రావుపాలెం, ఆలమూరు మండలాల్లో ఉగ్రదాడికి నిరసనగా బారీ ర్యాలీలు నిర్వహించినట్లు జనసేన పార్టీ అధినేత బండారు శ్రీనివాసు నేతృత్వంలో. కొత్తపేటలో అశేష జనవాహిని మద్య కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించగా రావులపాలెంలో మౌన దీక్ష చేపట్టి ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించామన్నారు. అలాగే ఆలమూరులో నల్ల కండువాలతో నిరసన చేపట్టి మానవహారం చేపట్టామన్నారు. అలాగే ఆత్రేయపురంలో శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నామన్నారు. ఈకార్యక్రమంలో నాలుగు మండలాల నుంచి వచ్చిన జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Terrorist attack a cowardly act

You cannot copy content of this page

Scroll to Top