జూన్ 27, 2026
TRINETHRAM NEWS

వరంగల్ జిల్లా ఏప్రిల్ 24 : తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలబడేది గులాబీ జెండా మాత్రమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ బాగుండాలని బీఆర్‌ఎస్‌ నాయకులు కోరుకుంటా రని.. కానీ కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు మాత్రం తమ కు ఓట్లు బాగా రావాలని అనుకుంటున్నారని విమర్శించారు.

ఆ రెండు పార్టీలు ప్రజల మధ్య చీలక తీసుకొచ్చి ఓట్లు పొందేందుకు ప్రయ త్నాలు చేస్తుంటాయని మండిపడ్డారు. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పార్టీ శ్రేణులతో కలిసి గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత పరిశీలించారు.

కాంగ్రెస్‌ది చేతగాని ప్రభుత్వమని ప్రజలకు తెలిసిపోయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో 16 పనులు కూడా కాలేదని విమర్శించారు. దేశానికే సేవలు అందించడానికి టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందామని వివరించారు. పరిణితి చెందడం ప్రకృతి ధర్మమని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందంటే అది ప్రజల కోరుకున్న రెవల్యూ షన్ అని చెప్పారు. రజతోత్సవం ఎందుకు చేసుకుంటున్నారని కొంతమంది వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు అవాకులు, చెవాకులు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ నేతలు మాట్లాడే మాటలను ప్రజలు క్షమించరని చెప్పా రు.బీఆర్ఎస్ పార్టీలోని మహిళా నాయకత్వాన్ని పటిష్టం చేయడానికి కేసీఆర్ రోడ్ మ్యాప్ ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

తెలంగాణ ప్రజల విజయా న్ని ప్రపంచానికి చాటడానికే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అని చెప్పారు. తెలంగాణ అస్తిత్వం కోసం 2001లో కేసీఆర్ పడికిలి బిగించి ఉద్యమాన్ని మొదలు పెట్టారని గుర్తుచేశారు.

ఉద్యమం మొదలుపెట్టి నప్పుడు ఉత్పన్నమైన అన్ని అనుమానాలను కేసీఆర్ పటాపంచలు చేశారన్నారు. ఒక రక్తం చుక్క కూడా చిందించ కుండా రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని కొనియాడారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

KCR is a hero who

You cannot copy content of this page