అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ఏప్రిల్ 25 : అరకు నియోజకవర్గంలోని మండల కేంద్రములో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన ఉద్యోగ భద్రత కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. జీఓ నెం.3 ఆర్డినెన్స్‌ను చట్టబద్ధత కల్పించాలని, మెగా డీఎస్సీని వద్దు ఆదివాసుల కోసం ప్రత్యేక డీఎస్సీ ముద్దు అని ప్లేకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచి పెంట చిన్నస్వామి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రివర్యులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిరిజనులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు చేయలేదు.మెగా డీఎస్సీ అంటే కేవలం 16 వేల పోస్టులు కాదు, రాష్ట్రవ్యాప్తంగా 30 వేల నుండి 50 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెద్ద సంఖ్యలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి,” అని డిమాండ్ చేశారు.“గత ప్రభుత్వాలు మరియు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేస్తున్నాయి. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున తిరుగుతున్నారు. అటెండర్ పోస్టులకు కూడా పీహెచ్.డి., పీజీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.”
గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఉద్యోగ భద్రత చట్టం తీసుకురావాలని, దాదాపు 64 శాఖల్లో గిరిజనులకు ఉద్యోగాల్లో న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలోని గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారు, కనీసం ఇప్పుడు కూటమి నాయకులు స్పందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ చైర్మన్ కన్నూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు పాంగి గంగాధర్, శెట్టి భగత్ రామ్, గంపరాయి భానుచందర్, కొర్రమితుల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


