Trinethram News : జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని సందర్శించారు. భారత జాతిపిత, విశ్వ శాంతి దూత మహాత్ముడికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్‌లోని ప్రసిద్ధ హిరోషిమా శాంతి స్మారకాన్ని సందర్శించారు. 1945 రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై జరిగిన అణుబాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. నాటి అణుబాంబు విధ్వంసంలో నిలిచిన ఏకైక శిథిలం అటామిక్ బాంబ్ డోమ్ ను కూడా సందర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు నివాళర్పించిన వారిలో ఉన్నారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


