Vijayasai Reddy : నాతో పెట్టుకోవద్దు… బట్టలు విప్పిస్తా

TRINETHRAM NEWS

విజయసాయిరెడ్డి మాస్ వార్నింగ్

Trinethram News : అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇదివరకే విచారణకు హాజరై పలు విషయాలు అధికారులకు తెలిపిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర విజిల్ బ్లోయర్ అని, తప్పించుకునేందుకే దొరికిన దొంగలతో పాటు ఈ కేసులో దొరకని దొంగలు నా పేరు లాగుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. లిక్కర్ కేసులో తాను ఏ రూపాయి ముట్టలేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారని.. మిగతా వారి బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తానంటూ బాంబు పేల్చారు.

దాంతో విజయసాయిరెడ్డి ఎవరి పేర్లు చెప్పనున్నారు, ఇంకా కేసులో ఎవరు ఇరుక్కోనున్నారు.

ఆయన ప్లాన్ ఏంటి అని వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ నుంచి వెళ్లిపోయిన విజయసాయిరెడ్డి పాలిటిక్స్ నుంచి తప్పుకుని రాజకీయాలు మొదలుపెట్టారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ తమ పార్టీ వారిపై లేనిపోని ఆరోపణలు చేసి, ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Don't mess with me

You cannot copy content of this page

Scroll to Top