cr 20241206tn6752b04d1b4fd
ఏపీకి పవన్ కల్యాణ్ నాయకత్వం వహించాలి… విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్!
యువ రాష్ట్రం ఏపీకి 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్న వైసీపీ నేత
రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్‌కు ఉందని వ్యాఖ్య
అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేనాని అన్న విజయసాయిరెడ్డి
Trinethram News : Andhra Pradesh : వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడ్ని ఉద్దేశిస్తూ… యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరన్నారు. నేషనల్ పాప్యులారిటీ, వయస్సు రీత్యా రాష్ట్రానికి నాయకత్వం వహించే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఉందని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఏపీలోని ఎన్‌డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి జనసేన అధినేత పవన్ అని ఆయన కొనియాడారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాతో వైరల్ అవుతోంది. దీనిపై జనసేన శ్రేణులు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
