త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలంలోని మంగళగుట్ట గ్రామంలో సోమవారం జరిగిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ధర్మకర్త శ్రీ కేదారేశ్వరరావు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా భాగ్యంతో సకల జనులందరూ సుఖసంతోషాలతో పాడిపంటలతో సంతోషంగా ఉండాలని కోరుతూ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా ఆలయ కమిటీ వారు భక్తులు నిర్వహించారు. యావన్మంది భక్తులందరూ స్వామి వారి కళ్యాణం లో పాల్గొని తిలకించి తరించి స్వామి వారి కల్యాణంలో పెద్ద ఎత్తున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తులు నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తిరుపతి రెడ్డి, పాల్వంచ ధనలక్ష్మి జ్యూయలరీ ప్రోపరేటర్ ఎల్ రాము, కమిటీ సభ్యులు రేపాక ప్రసాదరావు,మడకం రాజబాబు,, మడకం మణికంఠ, మడకం ఉమేష్ ఎ శ్రీను, డాక్టర్ గంటా వెంకటేశ్వర్లు,కుంజా జగన్, జి రాజు సాయి తేజ శ్రీ జ్యూయలరీ అనుబోస్ గిరి, రేగల ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు,బిక్కమల్ల సుధాకర్, బిక్కమల్ల ప్రభాకరరావు, పువ్వాల పవిత్ర తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


