MLA Gorantla : సమాజం కోసం తన యావదాస్తిని వదులుకున్న మహనీయులు కందుకూరి వీరేశలింగం

TRINETHRAM NEWS

ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గోరంట్ల

సమాజం కోసం తన యావదాస్తిని వదులుకున్న మహనీయులని, గొప్ప సంఘ సంస్కర్త అని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. స్థానిక ఆనంద గార్డెన్స్ నందు కీ.శే. కందుకూరి వీరేశలింగం పంతులు, రాజ్యలక్ష్మి వారి సమాధుల వద్ద ఎమ్మెల్యే గోరంట్ల ఘన నివాళులు అర్పించారు. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా పిల్లలకు పాఠాలతో పాటు, సంఘ సంస్కరణ భావాలను బోధించారని, సమాజంలోని అవకతవకలను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన, కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు ఆయన అంకుటిత దీక్షతో పనిచేశారని, సంఘ సేవ కోసం ఎంత కృషి చేశారో, సాహిత్యంలోనూ అంతే కృషి చేశారని, పత్రికలకు వ్యాసాలు రాస్తూ, వ్యవహారిక భాషలో రచనలు చేసిన ప్రధమ రచయితలలో కందుకూరి వీరేశలింగం ఒకరిని, తెలుగు సంస్కృతం, ఇంగ్లీష్ భాషల్లో ప్రతిభ కలిగిన వ్యక్తి అని తెలిపారు.

మొట్టమొదటి సహవిద్య పాఠశాలను ప్రారంభించారని, తెలుగులో తొలి నవల రాసింది కూడా ఆయనేనని గోరంట్ల అన్నారు. అలాగే ఆనంద్ గార్డెన్స్ నందు నిరంతరం ఆయన స్మృతులు తెలిసే విధంగా మంచి లైబ్రరీని అభివృద్ధి చేయుటకు మరియు ఆహ్లాద వాతావరణం ఉండే విధంగా మంచి గార్డెన్ నిర్మించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ అసిస్టెంట్ కమిషనర్ వినోద్ కుమార్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, కురుకూరి కిషోర్, కే.జగదీష్ ఎస్.రాజబాబు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

society is Kandukuri Veeresalingam...

You cannot copy content of this page

Scroll to Top