జూన్ 27, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతి బాపూలే 198వ జయంతి పురస్కరించుకొని నాయకులు పూలమాలతో సత్కరించి ఘన నివాళులు అర్పించడం జరిగింది, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు మాట్లాడుతూ జ్యోతి బాపూలే ఆడ పిల్లలకి చదువు ముఖ్యమని మొదట అయన భార్యకి చదువు నేర్పించి ఆడ పిల్లల చదువు కొరకు అనేక రకాలుగా కృషి చేసిన గొప్ప వ్యక్తి చదువుతోనే ఆడ పిల్లలకు హోదా గుర్తింపు ఉంటుంది అని చెప్పిన గొప్ప నాయకుడు అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగంటి దామోదర్ రెడ్డి, గుండబోయిన ఓదెలు, నా రెడ్డి స్వరాజ్యం, మాటేటి లక్ష్మి, బరిగేలా కళావతి, బేక్కం వీరేందర్, పెగడపల్లి రాజనర్సు, రాజబాబు, రామగిరి రాజేశ్వరి, సుందిల్లా స్వామి, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mahatma Jyoti Bapule Jayanti

You cannot copy content of this page