రాజమహేంద్రవరం, ఏప్రిల్ 11: స్థానిక దేవి చౌక్ లోని కాపునాడు కార్యాలయంలో రాజమండ్రి రూరల్, రాజానగరం కాపునాడు అధ్యక్షులు దేశీనీడి రాంబాబు, కాళ్ల చక్ర రావుల ఆధ్వర్యంలో నియామకాలు జరిగాయి. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా పిల్లా దుర్గాప్రసాద్, రాజానగరం మండల అధ్యక్షుడిగా బచ్చు నాగార్జున, లాలాచెరువు అధ్యక్షుడిగా కుంపట్ల రామకృష్ణ నియమితులయ్యా రు. ఈ మేరకు రాజమండ్రి పార్లమెంట్ కాపునాడు అధ్యక్షుడు ముమ్మిడి వీరబాబు నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఉభయగోదావరి జిల్లాల కాపునాడు అధ్యక్షులు గుదే రఘు నరేష్ మాట్లాడుతూ కాపు సంఘీయుల సమస్యల పట్ల స్పందించాలని అలాగే విద్యా, వైద్యం, ఉపాధి రంగాలలో సంఘీయులకు సంఘం తరఫున తోడ్పాటు అందించాలని ఐక్యమత్యంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రాజమండ్రి నగర అధ్యక్షుడు విన్నా వాసు, రూరల్ అధ్యక్షుడు దేశినీడి రాంబాబు, రాజానగరం అధ్యక్షుడు కాళ్ళ చక్రరావు, ఇంటి జయరాజు, సలాది తాతయ్య నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


