గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో జీడీకే -ఓసీపీ 5 లో విగ్రహ ఆవిష్కరణలో పాల్గొని పూలమాల అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ, ఈ దేశంలో కులం మతం అంతం కావాలని సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిని, ఆ రోజుల్లోనే అంటరానితనం నిర్మూలన కోసం పోరాడిన వ్యక్తిని, ఆడపిల్లలను చదువుకు దూరంగా పెట్టిన రోజులలో అతని భార్యతో విద్యాభ్యాసం నేర్పించిన వ్యక్తి ఆని, అంతేకాదు కార్మికులు కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి అన్నారు, అతని జీవిత చరిత్ర చదివి అందులోనే కొన్ని అంశాలనైనా మనం నేర్చుకుని అతని ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని అందుకోసం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు నిరంతరం కృషి చేస్తుందన్నారు, ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మెండె శ్రీనివాస్, తోట నరహరిరావు, జెల్ల గజేంద్ర, ఈద వెంకటేశ్వర్లు, నంది నారాయణ, బూరుగుల రాములు, వంగల శివరాం రెడ్డి, జి దుర్గాప్రసాద్, బి ప్రవీణ్ కుమార్, ఇప్పలపల్లి సతీష్, ఆడెపు కిషోర్ కుమార్, పోలేటి నరేష్, అభినందనలతో మెండె శ్రీనివాస్ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


