అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 9: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల శాసనమండలి సభ్యులుగా పి ఆర్ టి యు తరఫున ఇటీవల ఎన్నికైన గాదె శ్రీనివాస్ నాయుడు ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా పిఆర్టియు మండల, జిల్లా నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. పూలబుక్కేలుతో ఆయనకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పిఆర్టియు సభ్యులు ఎమ్మెల్సీ కి పలువురు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.ముఖ్యంగా మైదాన ప్రాంత ఉపాధ్యాయులను మళ్లీ మైదాన ప్రాంతాల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలని, రాబోయే మెగా డీఎస్సీలో ఏజెన్సీ పోస్టులను ఏజెన్సీ అభ్యర్థుల చేతనే నింపాలని కోరారు.
అదే విధంగా, ఇప్పటివరకు జాప్యం అయిన పిఆర్సి ప్రకటించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇది సాధ్యపడకపోతే ఐఆర్ (ఇంటిరిమ్ రిలీఫ్) అయినా వెంటనే ప్రకటించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న డి.ఏ విడుదల చేయాలని, అలాగే సిపిఎస్ ఉద్యోగుల పిఆర్సి బకాయిలను చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు.
ఈ అభ్యర్థనలపై ఎమ్మెల్సీ గాదె శ్రీనివాస్ నాయుడు సానుకూలంగా స్పందించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పిఆర్టియు మండల అధ్యక్షులు లక్ష్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు సహా పలువురు పిఆర్టియు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


